Telangana SSC Board Exam Results 2025
Andhra Pradesh SSC Exam Results 2025
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సెస్సీ (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు అలర్ట్. పదో తరగతి ఫలితాలు, మార్క్స్ మెమోలు టీవీ 9 తెలుగు డిజిటిల్ వెబ్‌సైట్‌లో నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు విద్యార్ధుల సౌలభ్యం కోసం టీవీ9 తెలుగు అందుబాటులో ఉంచుతుంది. అంతేకాకుండా 10వ తరగతి విద్యార్ధులకు అవసరమైన ఇతర గైడెన్స్.. అంటే మార్కుల రీకౌంటింగ్, సమాధాన పత్రాల రీవెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షలు.. వీటికి సంబంధించిన తేదీలు, దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు వంటి ఇతర ముఖ్యమైన సమాచారం కూడా ఈ పేజ్‌లో అందుబాటులో ఉంచుతున్నాం. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్దులు మానసికంగా కుంగిపోయి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు, సన్నిహితులు వారికి అండగా నిలిచి మనోధైర్యం అందించాలి. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్ధులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు అందుబాటులోకి తెచ్చే సైకాలజిస్టుల ఫోన్ నెంబర్లు కూడా ఇందులో పొందుపరుస్తున్నాం. వీటిని వినియోగించుకుని విద్యార్ధులు మానసికంగా దృఢంగా మారి కెరీర్‌లో ముందుకు సాగాలి.