
ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్‌గా ప్రస్తుతం సత్తా చాటుతున్నాడు. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ కెరియర్ మారిపోయిందని చెప్పవచ్చు. అప్పటి వరకు మాస్ హీరోగా ఉన్న ప్రభాస్.. బాహుబలి మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఆదిపురుష్ మూవీతో హీరోగా తనకున్న ఇమేజ్‌ను 360 డిగ్రీలు మార్చుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు రెబల్ స్టార్ మూవీస్ బిజినెస్ రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లకు చేరుకుందంటే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అభిమానులు ప్రభాస్‌ను డార్లింగ్‌గా పిలుచుకుంటారు.
1979 అక్టోబర్ 23న మద్రాసులో జన్మించారు ప్రభాస్. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు వారి కుటుంబ స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు ప్రభాస్. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్ర, అడవి రాముడు, చక్రం, ఛత్రపతి, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు సినిమాలు టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ రేంజ్‌ను పెంచేశాయి. బిల్లా, ఏక్ నిరంజన్, డార్టింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, రెబెల్, మిర్చి మూవీస్‌తో టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోస్ సరసన నిలిచాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. డిసెంబరు 22న రిలీజ్ కానున్న సాలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె, స్పిరిట్ పాన్ ఇండియా మూవీస్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.
కృష్ణంరాజుకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తేలు. దీంతో కృష్ణంరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు కుమారుడైన ప్రభాస్.. కృష్ణంరాజు నటవారసుడిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ అవడానికి సోదరుడి కుమారుడే అయినా.. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధమే కొనసాగేది. అంతగా తన నట వారసుడి గురించి కృష్ణంరాజు.. గర్వపడేవారు. ప్రభాస్, కృష్ణంరాజు కలసి రెబల్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇందులో తండ్రీకొడుకులుగా వారు నటించారు. నిజజీవితంలో కృష్ణంరాజు ప్రభాస్ కు పెదనాన్న కాగా.. ఈ చిత్రంలో మాత్రం.. ఇద్దరూ తండ్రీకొడుకుల్లా చేసిన నటన రెబల్ ఫ్యామిలీ ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్‌గా నిలిచింది. ఒకానొక సమయంలో ప్రభాస్ అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ తో హాలీవుడ్ రేంజ్ కి చేరారని స్వయానా కృష్ణంరాజు ఎంతో గర్వంగా చెప్పుకున్నారు.
Prabhas : ప్రభాస్ ఫెవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? కానీ కలిసి నటించడం కుదరదట..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు డార్లింగ్. మరికొన్ని చిత్రాలు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. తమ అభిమాన స్టార్ ఇష్టాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
- Rajitha Chanti
- Updated on: May 7, 2025
- 1:29 pm
ప్రభాస్‌కు కోడలిగా, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా చేసిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. వరుసగా రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్.
- Rajeev Rayala
- Updated on: May 5, 2025
- 7:59 pm
Heroes: పాన్ ఇండియా ట్రెండ్‌తో హీరోలకు కష్టాలు.. ఫ్యాన్స్‌కు దూరం..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో ఓ అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతుంది. ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్‌కు దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు.. వాళ్ల సమస్యేంటి..? ఇదే ఇవాల్టి స్టోరీ..
- Prudvi Battula
- Updated on: May 5, 2025
- 12:05 pm
Prabhas: తెలుగులో అధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డార్లింగ్ సినిమాలు ఇవే..
ప్రభాస్.. ఈ పేరు వెంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్‌కి చెమటలు పడతాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న మినిమమ్ 400పైనే వసూళ్లు చేయాలగల సత్తా డార్లింగ్ సొంతం. అయన సినిమాలకు ఇండియాలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని రీసెంట్గా కల్కి యూఎస్ కలెక్షన్స్, ఎప్పటికప్పుడు జపాన్ వసూళ్లు ప్రూవ్ చేస్తున్నాయి. అయితే తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రెబెల్ స్టార్ సినిమా ఏంటి.? ఈరోజు చూద్దాం..
- Prudvi Battula
- Updated on: May 5, 2025
- 11:27 am
International Range: బార్డర్లు దాటుతున్న కథలు.. మన మేకర్స్ ఎం ప్లాన్ చేస్తున్నారు.?
కథ బార్డర్లు దాటుతుంటే, ఊహలు ఉన్నచోటే.. మేమూ కదలకుండా ఉంటామంటే ఎలా? మీరు ఎంతైనా ఊహించుకోండి.. దానికి ఇంచు ఎక్కువే ఉంటుందనే హింట్స్ ఇస్తూ.. అవతలివారి ఊహను కేల్కులేట్ చేయడమెలా? వాటిని చేరుకోవడానికి టెక్నీషియన్లను వెతికిపట్టుకోవడం ఎలా? మరి మన మేకర్స్ ప్లాన్ ఏంటి.? ఇప్పుడు చూద్దాం..
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: May 5, 2025
- 10:26 am
Combination: క్రాస్ఓవర్ కొలాబరేషన్ నయా ట్రెండ్.. అందరిది ఇదే ఫార్ములా..
ఉన్నచోటే ఉండిపోవాలని ఎవరూ అనుకోరు. నిన్నటితో పోలిస్తే ఇవాళ, ఇవాళ్టితో కంపేర్ చేస్తే రేపు ఎంతో కొంత ఎదగాలనే అనుకుంటారు. అలాంటి డెవలప్‌మెంట్ వరల్డ్ డయాస్ మీద ఇండియన్ సినిమా విట్‌నెస్ చేయాలంటే క్రాస్ఓవర్ కొలాబరేషన్స్ కంపల్సరీ అనే మాట వినిపిస్తోంది.
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: May 4, 2025
- 9:43 am
Mahabharata: జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ..
రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని పలుమార్లు చెప్పుకొచ్చారు. జక్కన్న కనిపించిన ప్రతిసారి దీనిపై ఇదొక చర్చ జరుగుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరోసారి మాట్లాడారు దర్శకధీరుడు. ఈ సారి మరో హీరో పక్కాగా తన మహాభారతంలో నటిస్తారని క్లారిటీ ఇచ్చేశారు జక్కన్న. ఇంతకీ ఎవరా హీరో.? ఈ పాత్ర కోసం ఆయన్ని ఫిక్స్ చేసారు.? ఈరోజు మనం తెలుసుకుందాం..
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: Apr 30, 2025
- 11:34 am
Bahubali: పాన్ ఇండియా ట్యాగ్‌కు 10 వసంతాలు.. బాహుబలి డికేడ్ ఉత్సవాలకు భారీ ప్లాన్..
బాహుబలి ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఇండియన్ సినిమా హిస్టరీని బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అన్నట్టుగా మార్చేసింది ఈ క్లాసిక్ మూవీ. తెలుగు సినిమా పరవేంటో ప్రపంచానికి చాటింది. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
- Prudvi Battula
- Updated on: Apr 29, 2025
- 11:34 am
Pan India: పాన్ ఇండియాలో టాలీవుడ్ రూల్.. అసలు పరీక్ష మొదలైందన్న క్రిటిక్స్..
ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్‌లో మన హీరోలు జెండా పాతేశారు. ఇప్పుడు ఇండియన్ సినిమా హైదరాబాదే కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మరి ఈ స్థాయి సరిపోతుందా.? అలా అని సరిపెట్టుకుంటే ఇదే ప్లేస్‌లో మన సినిమా కంటిన్యూ అవుతుందా? అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందంటున్నారు క్రిటిక్స్.. మన హీరోలు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి సమయం ఇదే అంటున్నారు..? ఎందుకు అనుకుంటున్నారా..? ఈ స్టోరీలో చూద్దాం.
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: Apr 29, 2025
- 11:00 am
2026 Movies: 2025 మిస్.. 2026లో పక్క.. అంటున్న స్టార్ హీరోలు..
2025లో పెద్దగా స్టార్స్ సందడి లేకపోవటంతో సినీ అభిమానులంతా నెక్ట్స్ ఇయర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది గ్యాప్ రావటంతో 2026లో దాదాపు అందరు హీరోలు ఆడియన్స్ ముందుకు వచ్చేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే ఏడాది కాలంగా ఊరిస్తున్న ఒక్కడు మాత్రం నెక్ట్స్ ఇయర్ క్యాలెండర్‌ను కూడా కంపల్సరిగా స్కిప్ చేయబోతున్నాడు.
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: Apr 27, 2025
- 8:50 am