
రామ్ చరణ్
మెగస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా మెగా పవర్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా హిట్లు కొడుతూ ఏకంగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయాడు. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో రామ్ చరణ్ రేంజ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయింది. ప్రస్తుతం మన దేశంలో అత్యధిక పారితోషకం తీసుకునే నటుల్లో చెర్రీ కూడా ఒకరు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ, బిజినెస్ మెన్‌గానూ సత్తా చాటుతున్నాడు రామ్ చరణ్. 2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాలో వెండితెరకు పరిచయమయ్యాడీ మెగా పవర్ స్టార్. దుమ్మురేపే డ్యాన్స్‌లు, ఫైట్లతో మొదటి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ నటుడిగా ఫిల్మ్‌పేర్ పురస్కారం అందుకున్నాడు. ఇక రెండో చిత్రం మగధీరతో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాతో అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ కొల్లగొట్టాడీ గ్లోబల్ స్టార్. అంతేకాదు ఇదే సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా మరో ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. రచ్చతో మాస్ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు. ఎవడు, నాయక్, ధ్రువ.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్‌లోని నటనా ప్రతిభకు తార్కణంగా నిలిచింది. ఇందులో బుచ్చిబాబుగా చెర్రీ అభినయ విమర్శకులను సైతం మెప్పించింది. ఇదే సినిమాకు ఉత్తమ నటుడిగా మరోసారి ఫిల్మ్ పేర్ పురస్కారం అందుకున్నాడు రామ్ చరణ్. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌తో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను దున్నేశాడు. సీతారామరాజు పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మెగా పవర్ స్టార్ తన నటనతో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నాడు. ఇక నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌ను స్థాపించి హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2012లో ఉపాసన కామినేనితో పెళ్లిపీటలెక్కారు. 2023లో ఈ దంపతులకు క్లింకార కొణిదెల అనే కూతురు జన్మించింది.
NTR : చిరంజీవి , బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్ వేస్తే దుమ్ములేచిపోతుంది : ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.
- Rajeev Rayala
- Updated on: May 12, 2025
- 10:34 am
Ram Charan: గ్లోబల్ స్టార్‌కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ విగ్రహావిష్కరణ.. వీడియో
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చెర్రీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత కాలమానం ప్రకారం శనివారం (మే10) సాయంత్రం స్వయంగా రామ్ చరణ్ తన విగ్రహాన్ని ఆవిష్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
- Basha Shek
- Updated on: May 10, 2025
- 9:25 pm
Agent Movie: అఖిల్ ఏజెంట్ సినిమాలో మొదట ఆ స్టార్ హీరో నటించాల్సిందా? భారీ డిజాస్టర్ తప్పించుకున్నాడు
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చేతులు మారిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలా చేజారిపోయిన సినిమాల్లో కొన్ని హిట్లు కొడితే.. మరికొన్ని డిజాస్టర్‌లు అవుతుంటాయి. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా కూడా మొదట ఓ స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది.. కానీ..
- Basha Shek
- Updated on: May 10, 2025
- 6:55 pm
Ram Charan: నాగ్ అశ్విన్.. ఇది రిక్వెస్ట్ కాదు.. డిమాండ్ చేస్తున్నా.. రామ్ చరణ్ వీడియో వైరల్..
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్ గ్రీన్ హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి. డైరెక్టర్ రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికీ 35 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని శుక్రవారం మే 9న రీరిలీజ్ చేశారు మేకర్స్. కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు.
- Rajitha Chanti
- Updated on: May 9, 2025
- 10:53 am
Village Backdrop: పొలిమేర దాటని కథలు.. గ్రామీణ నేపథ్యంపైనే మన హీరోలు ఫోకస్..
పొలిమేర దాటని కథలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇదే ట్రెండ్ ఇంకా ఎన్నాళ్ళు ఎన్నేళ్లు కంటిన్యూ అవుతుందో చెప్పలేం. అందుకే వేడి మీదున్నపుడే ఇలాంటి కథలు రాసుకోవాలని ఫిక్సైపోతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు మాత్రమే కాదు.. రాబోయే సినిమాల్లోనూ చాలా వరకు గ్రామీణ నేపథ్యమే ఎక్కువగా కనిపిస్తుంది.
- Prudvi Battula
- Updated on: May 9, 2025
- 10:40 am
Dual Role: డ్యూయల్ రోల్లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. రానున్న సినిమాలు ఏంటి.?
అభిమాన నాయకుడిని తెరమీద ఒక పాత్రలో చూడటానికే రెండు కళ్లు సరిపోవు అభిమానులకు. అలాంటిది రెండు కేరక్టర్లంటే కనిపిస్తే పరిస్థితి మామూలుగా ఉంటుందా? జబర్దస్త్ అంటూ ఖుషీ అవుతున్నారు జనాలు. మరి డ్యూయల్ రోల్ స్టోరీ ఏంటి.? ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది.? దీని సంగతి చూద్దాం పదండి..
- Dr. Challa Bhagyalakshmi - ET Head
- Updated on: May 7, 2025
- 10:14 am
ఇదెక్కడి మాస్ రా మావ..!! పెద్ది స్టైల్‌లో సిక్స్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్.. చరణ్ ఏమన్నాడంటే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.
- Rajeev Rayala
- Updated on: May 5, 2025
- 4:54 pm
Heroes: పాన్ ఇండియా ట్రెండ్‌తో హీరోలకు కష్టాలు.. ఫ్యాన్స్‌కు దూరం..
కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో ఓ అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతుంది. ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్‌కు దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు.. వాళ్ల సమస్యేంటి..? ఇదే ఇవాల్టి స్టోరీ..
- Prudvi Battula
- Updated on: May 5, 2025
- 12:05 pm
ఒకప్పుడు తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఎవరో కనిపెట్టరా..
ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. టాలీవుడ్ లో యంగ్ బ్యూటీస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో రాణిస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది.
- Rajeev Rayala
- Updated on: May 4, 2025
- 3:43 pm
థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు చేస్తోన్న రెండో సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.
- Rajeev Rayala
- Updated on: May 3, 2025
- 6:56 pm