
బంగారం వెండి
బంగారం అనేది బంగారు ఆభరణాలు, నాణేల తయారీకి ఉపయోగించే లోహం. అదేవిధంగా, వెండి కూడా ఒక మెటల్. ఇది వెండి ఆభరణాలు, నాణేలు కాకుండా అనేక రకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తుంటారు. వెండి వివిధ రకాల పాత్రలు, పూజా సామాగ్రి, విగ్రహాల తయారీలో ఉపయోగిస్తుంటారు.
వెండి అనేది ఆభరణాలలో ఉపయోగించే లోహం. ఇది కాకుండా, మొబైల్ ఫోన్ల నుండి వివిధ ప్రోడక్ట్‌లలో కూడా ఉపయోగిస్తుంటారు. ఇక బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. బంగారం ధరల హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి.
భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారం, వెండి కొనుగోలును శుభప్రదంగా భావించే దేశం భారతదేశం. ధంతేరస్, దీపావళి సందర్భంగా కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఆ సమయంలో బంగారం షాపులన్ని కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచ కారకాలపై ఆధారపడి ఉంటాయి. పెట్టుబడి దృక్కోణంలో బంగారం, వెండి పెట్టుబడిదారులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 2017 వరకు, చైనా అతిపెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. బంగారం దిగుమతిలో భారత్ కూడా పోటీ పడుతుంటుంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. లేటెస్ట్‌గా తులం ఎంత ఉందంటే..
Gold And Silver Price In Hyderabad - Vijayawada: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. ఇటీవల గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కు దాటిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చినట్లే వచ్చి.. మళ్లీ ఎగబాకుతున్నాయి..
- Shaik Madar Saheb
- Updated on: May 8, 2025
- 6:15 am
Gold Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే!
గత రెండు మూడు రోజులుగా భారీ దిగొచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. మంగళావారం గోల్డ్ రేట్లు చూసుకుంటే 18 క్యారెట్ల బంగారం ధర1 గ్రాము రూ.7,181లుగా ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతోనే గోల్డ్ రేట్లు ధరల్లో మార్పులు వచ్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ః
- Anand T
- Updated on: May 6, 2025
- 11:30 am
Gold Rates: భారీగా తగ్గుతున్న బంగారం రేట్లు.. తగ్గింపునకు ప్రధాన కారణాలివే..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులకు ప్రస్తుతం బంగారం అనేది రిస్క్ లేని పెట్టుబడి ఎంపికగా మారింది. పెరుగుతున్న అనిశ్చితితో పాటు ద్రవ్యోల్భణం భయాల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య బాగా పెరిగింది. ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.లక్షకు చేరువైనా క్రమేపి తగ్గుతూ వస్తుంది. నిపుణులు బంగారం ధరలు భవిష్యత్‌లో కూడా తగ్గుతాయని వివరిస్తున్నారు.
- Srinu
- Updated on: May 4, 2025
- 7:30 pm
Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం బంగారం ధర ఎంతుందంటే..
Gold And Silver Price In Hyderabad - Vijayawada: గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి.. మొన్నటికి మొన్న తులం బంగారం లక్ష దాటేసింది. అయితే చూస్తుండగానే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏప్రిల్ 22న లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ మధ్యలో ఒకసారి మాత్రమే స్వలంగా పెరిగింది.
- Shaik Madar Saheb
- Updated on: May 4, 2025
- 6:26 am
Akshaya Tritiya: తగ్గేదేలే.. అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొనుగోలు చేశారో తెలిస్తే షాకవుతారు!
Akshaya Tritiya: ప్రతి సంవత్సరం బంగారం కొత్త శిఖరాలను తాకుతున్నప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా బంగారం డిమాండ్ తగ్గలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం ఏటా 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇదిలా ఉండగా, బుధవారం బలహీనమైన ప్రపంచ ధోరణుల మధ్య బంగారం ధరలు..
- Subhash Goud
- Updated on: May 1, 2025
- 7:03 pm
Gold Rate Today: బంపర్ బొనాంజా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందంటే..
మీకు గుర్తుందా? 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం మొన్నీమధ్య లక్షా రెండువేల 62 రూపాయలకు చేరింది. ఇది ఆల్‌టైమ్ హై. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు- మొన్నటిదాకా మిడిసిపడిన పసిడి.. ఇప్పుడు దిగివస్తోంది. గత నెల రోజులుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బంగారం ధరలు భారీ ఊరటను ఇచ్చాయి.
- Shaik Madar Saheb
- Updated on: May 1, 2025
- 12:56 pm
Gold investment: బంగారంలో పెట్టుబడికి ఇదే మంచి సమయం.. ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
భారతీయులకు అత్యంత నమ్మకమైన పెట్టుబడి మార్గాలలో బంగారం ఒకటి. ఈ లోహం విలువ క్రమంగా పెరుగుతూ ఉండడమే దీనికి ప్రధానం కారణం. మన జీవితాలకు బంగారంతో ఎంతో అనుబంధం ఉంది. అది లేకుండా ఏ శుభకార్యక్రమం జరగదంటే అతిశయోక్తి కాదు. మహిళలతో పాటు పురుషులు బంగారు ఆభరణాలను ఎంతో ఇష్టంగా ధరిస్తారు. అలాగే అత్యవసర సమయంలో డబ్బు అవసరమైనప్పుడు బంగారు ఆభరణాలను తాకట్టు పెడతారు. వీటికి త్వరగా రుణాలు మంజూరు కావడంతో పాటు వడ్డీరేటు తక్కువగా ఉంటుంది.
- Srinu
- Updated on: Apr 30, 2025
- 4:30 pm
Gold Price Today: అక్షయ తృతీయ రోజు షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Gold Rate Today: ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30న అంటే నేడు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని అంతా భావిస్తుంటారు. బంగారు ఆభరణాల నుంచి బంగారు నాణేల వరకు ఏది వీలైతే అది ఇంటికి తెచ్చుకుంటుంటారు.
- Venkata Chari
- Updated on: Apr 30, 2025
- 6:34 am
Akshaya Trithiya: అక్షయ తృతీయ రోజున బంగారం కొనేందుకు శుభ సమయం ఇదే.. పూర్తి వివరాలు
అక్షయ తృతీయ వచ్చేసింది! రేపే అక్షయ తృతీయ.. అక్షయ తృతీయకు బంగారం కొనడం శుభసూచకంగా భావిస్తారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కలిసి వస్తోంది. మరి బంగారం కొనుగోళ్లలో సెంటిమెంట్ కలిసొస్తుందా? అక్షయ తృతీయపై గోల్డ్ రేటు పెరుగుదల ప్రభావం చూపిస్తుందా?
- Ravi Kiran
- Updated on: Apr 29, 2025
- 7:05 pm
Akshaya Tritiya: ఫోన్ పేలో బంగారం లాంటి ఆఫర్.. రేపు ఒక్కరోజే అవకాశం
భారతీయులు పండగలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండగలను ఎంతో ఘనంగా జరుపుకొంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒక దగ్గరకు చేరుకుని ఆనందంగా గడుపుతారు. అలాంటి వాటితో అక్షయ తృతీయ ఒకటి. ఆ రోజు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదమని అందరి విశ్వాసం. ఈ నేపథ్యంలో ప్రజలందరూ తమ స్థోమతకు అనుగుణంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ రానుంది. ఈ సందర్భంగా ఫోన్ ఫే, ఎయిర్ టెల్ బ్యాంకు పలు ఆఫర్లను ప్రకటించాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
- Srinu
- Updated on: Apr 29, 2025
- 4:00 pm