AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2025

లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2025-26.. తగ్గేవి, పెరిగేవి ఇవే
లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2025-26.. తగ్గేవి, పెరిగేవి ఇవే

Budget Session 2025 Parliament LIVE: లోక్‌సభలో బడ్జెట్‌ను ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించారు. వ్యవసాయం, MSME, ఎగుమతులు, పెట్టుబడులు సహా ఆరురంగాల్లో సమూల మార్పులు చేశారు. వికసిత్‌ భారత్‌ ...

కొత్త ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ మీ కోసం
కొత్త ఆదాయపు పన్ను కాలిక్యులేటర్ మీ కోసం
బడ్జెట్‌లో NDA మిత్రపక్షాలు ఏం సాధించాయి..?
బడ్జెట్‌లో NDA మిత్రపక్షాలు ఏం సాధించాయి..?
Railway Budget 2025: రైల్వే బడ్జెట్‌ రూ. 2.65 లక్షల కోట్లు..
Railway Budget 2025: రైల్వే బడ్జెట్‌ రూ. 2.65 లక్షల కోట్లు..
బడ్జెట్‌లో రైతాంగానికి తీపికబురు..!
బడ్జెట్‌లో రైతాంగానికి తీపికబురు..!
Budget Live
View more
  • 01 Feb 2025 01:24 PM (IST)

    పెరిగేవి ఇవే

  • 01 Feb 2025 01:23 PM (IST)

    రూపాయి రాక.. పోక ఇలా..

  • 01 Feb 2025 12:52 PM (IST)

    బడ్జెట్ హైలైట్స్

కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు
కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక కేటాయింపులు
బడ్జెట్‌పై ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..!
బడ్జెట్‌పై ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..!

బడ్జెట్ 2025 - ఏది చౌక, ఏది ఖరీదైనది?

Cheaper
  • చేనేత వస్త్రాలు
  • తోలు వస్తువులు
  • మొబైల్ ఫోన్, బ్యాటరీ, టీవీ
  • ఎలక్ట్రిక్ వెహికల్స్
  • భారతదేశంలో తయారైన దుస్తులు
  • వైద్య పరికరాలు
  • క్యాన్సర్, అరుదైన వ్యాధులకు వాడే మందులు
  • పలు రకాల ఖనిజాలు
Costlier
  • ప్రీమియం టీవీలు
  • దిగుమతి చేసుకున్న మోటార్‌సైకిళ్లు
  • ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లేలు
  • అల్లిన బట్టలు
view more

మీ ఆదాయపు పన్ను స్లాబ్‌లను తెలుసుకోండి

Tax Slab 2024-25
Tax Slab 2025-26
Regular Slab
Old Tax Regime
Income Tax Slab Income Tax Rate
0-2.5 లక్షల రూపాయలు0%
2.5-5 లక్షల వరకు ఉంటుంది5%
5-10 లక్షల వరకు ఉంటుంది20%
10 లక్షల పైన30%
New Tax Regime
Income Tax Slab Income Tax Rate
0-3 లక్షల రూపాయలు0%
3-7 లక్షల రూపాయలు5%
7-10 లక్షల రూపాయలు10%
10-12 లక్షల రూపాయలు15%
12-15 లక్షల రూపాయలు20%
15 లక్షల కంటే ఎక్కువ30%
Regular Slab
Old Tax Regime
Income Tax Slab Income Tax Rate
0-2.5 లక్షల రూపాయలు0%
2.5-5 లక్షల వరకు ఉంటుంది5%
5-10 లక్షల వరకు ఉంటుంది20%
10 లక్షల పైన30%
New Tax Regime
Income Tax Slab Income Tax Rate
0-4 లక్షల రూపాయలు0%
4-8 లక్షల రూపాయలు5%
8-12 లక్షల రూపాయలు10%
12-16 లక్షల రూపాయలు15%
16-20 లక్షల రూపాయలు20%
20-24 లక్షల రూపాయలు25%
24 లక్షల పైన30%

రంగాల వారీగా బడ్జెట్

ఇతర వార్తలు

కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!

కేంద్రం కీలక నిర్ణయం.. ఆన్‌లైన్ ప్రకటనలపై డిజిటల్ పన్ను రద్దు!

ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క

ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లంటే..

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లంటే..

అభివృద్ధి, సంక్షేమంపైనే ఫోకస్.. రూ.3.30లక్షల కోట్లతో భారీ బడ్జెట్

అభివృద్ధి, సంక్షేమంపైనే ఫోకస్.. రూ.3.30లక్షల కోట్లతో భారీ బడ్జెట్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. మళ్లీ హీటెక్కనున్న పాలిటిక్స్..

కూటమి వర్సెస్ వైసీపీ.. బడ్జెట్‌పై మాటల యుద్ధం..

కూటమి వర్సెస్ వైసీపీ.. బడ్జెట్‌పై మాటల యుద్ధం..

గుడ్‌న్యూస్‌.. 'తల్లికి వందనం' పథకం డబ్బులు అందేది ఆ నెల నుంచే..!

గుడ్‌న్యూస్‌.. 'తల్లికి వందనం' పథకం డబ్బులు అందేది ఆ నెల నుంచే..!

గత ప్రభుత్వం చేసిన అప్పులు.. రాష్ట్రంపై అణుబాంబు దాడితో సమానం!

గత ప్రభుత్వం చేసిన అప్పులు.. రాష్ట్రంపై అణుబాంబు దాడితో సమానం!

ఏపీ వార్షిక బడ్జెట్‌.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లంటే..?

ఏపీ వార్షిక బడ్జెట్‌.. పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లంటే..?

దేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?

దేశంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?

కొత్త ఐట్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

కొత్త ఐట్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం

రాజ్యసభలో కాంగ్రెస్‌ను చీల్చి చెండాడిన ప్రధాని మోదీ

రాజ్యసభలో కాంగ్రెస్‌ను చీల్చి చెండాడిన ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్ 2025-26

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ వార్షిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తినెలకొంటోంది. బడ్జెట్‌కు ముందే 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మోదీ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రూ.1000గా ఉన్న ఈపీఎఫ్ పెన్షన్‌ను నెలకు రూ.5 వేలకు పెంచాలని కేంద్రాన్ని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. అలాగే ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలన్న ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. గత కొంతకాలంగా రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించడంతో దీన్ని నిరోధించేందుకు బడ్జెట్‌లో దిగుమతులపై అధిక సుంకాలను విధించే అవకాశముంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేంద్రానికి వినతులు అందుతున్నాయి.

బడ్జెట్ 2025కి సంబంధించిన ఆసక్తికర ప్రశ్నలు – జవాబులు

ప్రశ్న – కేంద్ర వార్షిక బడ్జెట్‌ 2025-26ను ఎప్పుడు ప్రవేశపెడతారు?

జవాబు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న కేంద్ర వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తారు.

ప్రశ్న – తెలుగింటి కోడలు, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఎన్నోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు?

జవాబు – ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా 8వ సారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు

ప్రశ్న – బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏయే అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు?

జవాబు – బడ్జెట్‌లో ఈపీఎఫ్ నెల పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచాలని, ఆదాయపు పన్ను మినహాయింపును రూ.10 లక్షలకు పెంచాలని ట్రేడ్ యూనియన్లు కేంద్రాన్ని కోరుతున్నాయి.

ప్రశ్న – రూపాయి మారకం విలువ మరింత పడిపోకుండా బడ్జెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు..?

జవాబు – డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించింది. దీన్ని నియంత్రించేందుకు దిగుమతులపై సుంకాలను పెంచే అవకాశం ఉంది.

ప్రశ్న – బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఉంటాయా?

జవాబు – బడ్జెట్లో ఆటో మొబైల్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఉండొచ్చు. ముఖ్యంగా EV అమ్మకాలను పెంచే దిశగా ప్రత్యేక రాయితీలు ప్రకటించే అవకాశముంది.

ప్రశ్న – బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిమితి పెంచుతారా?

జవాబు – ఈసారి బడ్జెట్లో గృహ రుణంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.5 లక్షలకు పెంచాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రశ్న – బడ్జెట్లో మొదటిసారిగా వేతన జీవులకు లబ్ధి చేకూర్చింది ఎవరు?

జవాబు – ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో 1974 బడ్జెట్లో మొదటిసారి స్టాండర్డ్ డిడక్షన్ ప్రవేశపెట్టారు.

ప్రశ్న – బడ్జెట్‌కు ముందు హల్వా వేడుకను ఎందుకు జరుపుకుంటారు?

జవాబు – ఏదైనా శుభకార్యం చేసే ముందు, ఏదైనా తీపి తినాలి.. అందుకే బడ్జెట్ వంటి పెద్ద కార్యక్రమాలకు ముందు ఈ వేడుకను నిర్వహించే సాంప్రదాయం ఉంది.

ప్రశ్న – రైల్వే బడ్జెట్ను బడ్జెట్లో ఎప్పుడు విలీనం చేశారు?

జవాబు – 2016లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు చివరి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2017 నుంచి వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్ను విడివిడిగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి పలికారు. రైల్వే బడ్జెట్ను కూడా సాధారణ బడ్జెట్లోనే విలీనం చేశారు.

ప్రశ్న- స్వతంత్ర భారతావనిలో తొలి కేంద్ర బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జవాబు – దేశంలో తొలి బడ్జెట్‌ను 1947 నవంబరు 26న నాటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు.

ప్రశ్న- అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినవారు ఎవరు?

జవాబు – కేంద్ర బడ్జెట్ను అత్యధికంగా 10సార్లు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టారు. 1962 నుంచి 69 మధ్య కాలంలో ఆర్థిక మంత్రిగా 10సార్లు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ప్రశ్న- ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు

జవాబు – నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025 ఫిబ్రవరి 1న ఎనిమిదో సారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ప్రశ్న – బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఎప్పుడు మార్చారు?

జవాబు – 2016 వరకు కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి పనిదినం రోజు సమర్పించే సాంప్రదాయం ఉండేది. 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీన్ని ఫిబ్రవరి 1 తేదీకి మార్చారు. అప్పటి నుంచి ప్రతి యేటా ఆ తేదీన బడ్జెట్ సమర్పిస్తున్నారు.

ప్రశ్న- బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళలు ఎవరు?

జవాబు – ఇందిరా గాంధీ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 2019లో నాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు.