
చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. తెలుగు దేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు నవ్యాంధ్రకు రెండోసారి సీఎం అయ్యారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు రెండుసార్లు, నవ్యాంధ్రకు రెండుసార్లు సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.
చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా 1973లో చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓటమి తర్వాత, ఆయన కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ ప్రస్తుతం చంద్రబాబు మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మని వివాహం చేసుకోగా.. వారికి కుమారుడు దేవాన్ష్ ఉన్నారు.
యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.
Watch Video: ఓ అమరవీరుడా సెల్యూట్.. మురళీనాయక్‌కు కన్నీటి వీడ్కోలు.. భారీగా హాజరైన జనం..
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ మురళీనాయక్‌కు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. అగ్నివీరుడిగా సైన్యంలోకి ఎంటరై, అమరవీరుడిగా అందరికీ స్ఫూర్తిని అందిస్తోన్న యువ కెరటానికి ఈ దేశం సలామ్ చేస్తోంది. పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 11, 2025
- 3:56 pm
ఆపరేషన్ సింధూర్ తర్వాత టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టీవ్ కాబోతున్నాయా..? ఏపీ, తెలంగాణ అలెర్ట్
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ అలెర్ట్ అయ్యాయి. రాబోయే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేలా అన్ని శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నాయి. అందులోనూ.. గత అనుభవాల దృష్యా హైదరాబాద్‌లోని స్లీపర్ సెల్స్ యాక్టీవ్‌పై తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టడం ఆసక్తి రేపుతోంది.
- Balaraju Goud
- Updated on: May 7, 2025
- 11:06 pm
Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో భూ కేటాయింపుల వివరాలివే..
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి.
- Eswar Chennupalli
- Updated on: May 6, 2025
- 9:00 pm
AP Ration Card: రేషన్ కార్డు లేని వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ.. పూర్తి వివరాలివే..
కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: May 6, 2025
- 6:41 pm
Amaravati: రాజధాని నిర్మాణ పనులు వేగవంతం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పున:ప్రారంభానికి కూటమి ప్రభుత్వం రెండు రోజుల క్రితం శ్రీకారం చుట్టింది. అమరావతి పర్యాటనలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి నిర్మాణంలో అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. దాంతో.. మోదీ టూర్ తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభోత్సవం పూర్తి కావడంతో రాజధాని పనులు పరుగులు తీయనున్నాయి.
- Shaik Madar Saheb
- Updated on: May 4, 2025
- 10:07 am
PM Modi: సీఎం చంద్రబాబు నాకు మంచి మిత్రుడు.. ప్రధాని మోదీ సంచలన ట్వీట్..
ఆంధ్రుల ఆశ, ఆకాంక్షగా ఉన్న అమరావతి పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా రీస్టార్ట్ చేశారు.. ఈ వేడుకలో అడుగడుగునా రైతులకు జై కొట్టింది ఏపీ ప్రభుత్వం. రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాకుండా.. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోంటూ పొరాటం కొనసాగించిన వారి సంకల్పానికి సెల్యూట్ కొట్టారు.
- Shaik Madar Saheb
- Updated on: May 3, 2025
- 12:26 pm
5 కోట్ల మందికి జీవనాడి.. ధర్మ యుద్ధంలో గెలిచిన అమరావతి రైతులు.. పవన్ కల్యాణ్
రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు.. రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతులు ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని నలిగిపోయారన్న పవన్, అమరావతి రైతుల కన్నీళ్లు తుడిచే సమయం వచ్చిందన్నారు. అమరావతి ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్.. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టిందన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారన్నా పవన్ కల్యాణ్.
- Balaraju Goud
- Updated on: May 2, 2025
- 4:53 pm
PM Modi in Amaravati Live: నభూతో నభవిష్యతి.. అత్యాధునిక హంగులతో అమరావతి పునర్నిర్మాణం.. ప్రధాని మోదీ శ్రీకారం
PM Modi in Andhra Pradesh Live Updates: రాజధాని నిర్మాణంలో ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంది చంద్రబాబు ప్రభుత్వం. మోదీ శంకుస్థాపన చేయడమే ఆలస్యం..పనులను జెట్‌వేగంతో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను 77 వేల 249కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ ఒక్కరోజే 49 వేల 040కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: May 2, 2025
- 6:42 pm
అమరావతి రీలాంచ్‌కు కౌంట్ డౌన్.. ఎస్పీజీ ఆధీనంలోకి సభా ప్రాంగణం.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో..
ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అమరావతిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మోదీ టూర్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: May 1, 2025
- 1:53 pm
Andhra News: అమరావతికే పట్టం.. చట్టబద్దతకు పక్కాగా అడుగులు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఔను.. అమరావతికే పట్టం. భవిష్యత్తులో కూడా దానికి తిరుగులేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకోసం పార్లమెంటులో చట్టం చేయిస్తామన్నారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండడంతో గతంలో చట్టం కుదరలేదన్న సీఎం..ఇప్పుడా సమస్య లేదన్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో రాజధాని రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి.. పలు అంశాలపై వారికి క్లారిటీ ఇచ్చారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 29, 2025
- 9:37 am