
భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతలు
యుద్ధమంటే బాంబుల వర్షం కురిపించడం, శతఘ్నులను గురిపెట్టడమా? విమానాలు శత్రు దేశంపైకి దూసుకెళ్తేనే సమరం మొదలైనట్లా? క్షిపణులు ఎక్కుపెడితేనే సమరభేరి మోగినట్టా? కానే కాదు.. ఎందుకంటే ఇది కత్తులు దూసే కాలం కాదు. విల్లంబులు సంధించే యుద్ధాలు కావు. రక్తం కళ్లజూస్తేనే, శత్రువు లొంగిపోతేనే విజయమనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. బొందిలో ప్రాణమున్నా ఊపిరి ఆపేయొచ్చు. బలప్రయోగం చేయకుండానే కాళ్లూచేతులు కట్టేయొచ్చు. పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు భారత్ చేస్తోంది అదే. ఆ లెక్కన పాకిస్తాన్‌పై భారత్ ఎప్పుడో వార్ స్టార్ట్ చేసింది. వరుస స్ట్రయిక్స్‌తో దాయాది ఉక్కిరిబిక్కిరవుతోంది.
వాటర్ స్ట్రయిక్‌తో పాకిస్తాన్‌పై యుద్ధం మొదలుపెట్టేసింది భారత్. సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దుచేయడం శత్రువు ఊహకైనా అందని మేజర్ ఎటాక్. ఇప్పుడా నదిపై ఆరు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతోంది మేరా భారత్. సింధూ ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆరు నెలల ముందు పాకిస్తాన్‌తో షేర్ చేసుకోవాలి. కానీ ఒప్పందమే రద్దయిపోవటంతో పాకిస్తాన్‌కి చెప్పడానికేం లేదు.. చేసుకుంటూ పోవడమే. చీనాబ్ నదిపై సలాల్ డ్యామ్, బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసేయటంతో పాకిస్తాన్ గొంతు ఎండటం మొదలైంది.
పాకిస్తాన్‌కు ఇప్పటికే అన్ని రకాల ఎగుమతులను నిలిపివేసి వాణిజ్యపరంగా ఆంక్షలు విధించింది భారత్. దాయాది దేశంనుంచి అన్ని దిగుమతులూ నిలిపేసింది. పాకిస్తాన్‌తో సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. అటు దౌత్యపరంగా కూడా పాక్‌ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాకిస్తాన్‌కు ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్యాకేజీ ప్రకటించిన ఐఎంఎఫ్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తోంది. ఏడీబీ బ్యాంక్ అధ్యక్షుడితో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు నిధులు ఇవ్వొద్దని కోరారు కేంద్రమంత్రి. మరోవైపు.. పాకిస్తాన్ మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లోకి వెళ్లేలా మన దేశం ఒత్తిడి తీసుకొస్తోంది.
పాక్ నుంచి భారత్‌కు వచ్చే అన్ని మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీలపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు, నోటి దురుసుతో అదే యుద్ధమనుకుంటోంది. తుర్కియే సాయమే గొప్పనుకుంటోంది. చైనా మద్దతిస్తుందని ఆశపడుతోంది. కానీ అదే సమయంలో రష్యా-భారత్‌కు మద్దతిచ్చింది. ఫ్రాన్స్ లాంటి అగ్రదేశాలు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే పాక్ బలూచిస్తాన్‌లో అంత్యరుద్ధం మొదలైంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. నీళ్లుకూడా అందక రేపు తిండిగింజలకు కూడా అలమటించాల్సి వచ్చేలా ఉంది. అందుకే పిచ్చిపట్టినట్లు నియంత్రణరేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.
బయటకు వెళ్తే తలెత్తుకోలేక పోతున్నాం.. ఇది పాక్ జర్నలిస్టుల మాట. ఉగ్రవాదులను పెంచి పోషించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే కోపంతో ఉన్నారు పాక్ ప్రజలు కూడా. ప్రజల్లో ఎంత అసహనం ఉందో చెప్పేందుకే ఇస్లామాబాద్‌లోని లాల్ మసీదులో జరిగిన ఘటనే నిదర్శనం. భారత్‌తో యుద్ధం జరిగితే ఎవరు మా వెంట నిలుస్తారని మౌలానా అడిగితే.. ఒక్కటంటే ఒక్క చెయ్యీ పైకిలేవలేదు. పాక్‌లోని అంతర్గత రాజకీయాలు, ఆర్థికసంక్షోభంతో పాక్ ప్రజలు విసిగివేసారిపోయారు. పాలకులతో పాటు సైన్యంపైనా నమ్మకం కోల్పోతున్నారు. భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్‌కి ఇంతకంటే ఘోర అవమానం ఏముంటుంది? మరోవైపు ఆ దేశ నేతలు మాత్రం అణుబాంబులు ఉన్నాయి జాగ్రత్త అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Operation Sindoor: S-400 రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి? దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవుతారు!
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతదేశం రష్యన్ S-400 రక్షణ వ్యవస్థను ఉపయోగించి పాకిస్తాన్ డ్రోన్-క్షిపణి దాడిని తిప్పికొట్టింది. దీనికి ఉన్న ప్రత్యేకతలు అన్ని ఇన్నీ కావు. ఎంతటి శతృవున్ని సైతం ఓడించే సత్తా ఈ S-400 సొంతం. భారతదేశంలో "సుదర్శన్ చక్ర" అని పిలుస్తారు.
- Subhash Goud
- Updated on: May 12, 2025
- 5:17 pm
PM Modi: ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతినుద్దేశించి తొలి సందేశం.. అందరిచూపు ప్రధాని మోదీ ప్రసంగం వైపే..
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అయితే.. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక తొలిసారి ప్రసంగం చేయనున్నారు. దీంతో అందరి చూపు ప్రధాని మోదీ ప్రసంగం పైనే ఉంది..
- Shaik Madar Saheb
- Updated on: May 12, 2025
- 5:30 pm
Operation Sindoor: పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం- ఇండియన్ ఆర్మీ
Operation Sindoor: BSF జవాన్లు వారి బాధ్యతను నిర్వహించారని, అమాయక ప్రజలపై పాక్ దాడులకు తెగబడిందని రాజీవ్‌ఘాయ్ అన్నారు. పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను చంపారని, మేం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ముందే సిద్ధం చేశామన్నారు. మన ఎయిర్ డిఫెన్స్ బలమైనగోడలా నిలిచిందని..
- Subhash Goud
- Updated on: May 12, 2025
- 4:03 pm
మా జోలికొస్తే అంతే.. టర్కీని చావు దెబ్బ కొడుతున్న సామాన్య భారతీయులు!
పాకిస్తాన్‌కు టర్కీ ప్రభుత్వం మద్దతు ఇవ్వడంతో భారత వ్యాపారవేత్తలు టర్కిష్ ఆపిల్స్‌ను బహిష్కరించారు. ఈ నిర్ణయం వలన ఇరాన్, అమెరికా, న్యూజిలాండ్ ఆపిల్స్ ధరలు పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్లో 10 కిలోల ఆపిల్ ధర రూ.200 నుండి రూ.300కు, రిటైల్ మార్కెట్లో కిలో ధర రూ.20 నుండి రూ.30కు పెరిగింది.
- SN Pasha
- Updated on: May 12, 2025
- 2:43 pm
పక్కా ఆధారాలతో బయటపడ్డ పాక్ బండారం..! ఉగ్రవాదిని మానవతా వాది అంటూ దొంగనాటకాలు!
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్‌ను మత నాయకుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ పాకిస్థాన్ అడ్డంగా బుక్ అయింది. అతని నిజస్వరూపం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ద్వారా బహిర్గతమైంది. రవూఫ్ ఉగ్రవాద సంస్థలకు నిధులు సేకరిస్తున్నట్లు తేలింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాదులకు రక్షణ కల్పిస్తోందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
- SN Pasha
- Updated on: May 12, 2025
- 12:34 pm
ISRO: టెన్షన్ వద్దు.. 10 శాటిలైట్లు 24 బై 7 దేశాన్ని పహారా కాస్తున్నాయి: ఇస్రో
ఇస్రో చైర్మన్ వి. నారాయణన్, పాకిస్థాన్‌తో ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారతదేశ సరిహద్దులను, తీర ప్రాంతాలను 24/7 పర్యవేక్షించడానికి 10 ఉపగ్రహాలు నిరంతరం పనిచేస్తున్నాయని ప్రకటించారు. ఈ ఉపగ్రహాలు కీలకమైన నిఘా డేటాను అందించి, జాతీయ భద్రతను బలోపేతం చేస్తున్నాయి. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ దేశ రక్షణకు అత్యవసరమని వివరించారు.
- SN Pasha
- Updated on: May 12, 2025
- 10:42 am
ప్రధాని మోదీ వార్నింగ్..! సరిహద్దుల్లో చాలా రోజులకు ప్రశాంతంగా గడిచిన రాత్రి ఇదే..!
భారత్, పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల కాల్పుల తర్వాత, శనివారం సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్ తొలుత విరమణను ఉల్లంఘించినప్పటికీ, భారత ప్రతిస్పందన తర్వాత సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయి.
- SN Pasha
- Updated on: May 12, 2025
- 9:10 am
Operation Sindoor: మరో ఇద్దరు వీర జవాన్లను కోల్పోయిన భారత్! పాకిస్థాన్ కాల్పుల్లో అమరులైన మెహమ్మద్, దీపక్
జమ్మూ డివిజన్‌లోని ఆర్‌ఎస్ పురా ప్రాంతంలో మే 9, 10 తేదీల మధ్య పాకిస్తాన్ రేంజర్లు జరిపిన సరిహద్దు కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దీపక్ చింగాఖం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. ఇదే కాల్పుల్లో మరో జవాన్, సబ్-ఇన్‌స్పెక్టర్ మెహమ్మద్ ఇంతేయాజ్ కూడా మృతిచెందారు. బీఎస్‌ఎఫ్ వారి త్యాగాన్ని స్మరించి పూర్తి గౌరవాలతో నివాళులు అర్పించింది.
- SN Pasha
- Updated on: May 12, 2025
- 8:48 am
ఆపరేషన్ సింధూర్.. పాక్ వైమానిక స్థావరాలు నేలమట్టం.. ఇదిగో సజీవ సాక్ష్యాలు!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారీ సైనిక దాడిలో భాగంగా, మే 10న నాలుగు ప్రధాన పాకిస్తాన్ వైమానిక దళ (PAF) స్థావరాలపై భారత ఆర్మీ ఖచ్చితమైన వైమానిక దాడులను ప్రారంభించింది. తాజాగా భారత త్రివిధ దళాలు విడుదలు చేసిన ఉపగ్రహ చిత్రాలు పాకిస్థాన్‌కు జరిగిన అపర నష్టాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.
- Balaraju Goud
- Updated on: May 11, 2025
- 10:01 pm
ఆపరేషన్ సింధూర్‌లో ఇప్పటి వరకు ఎంత మంది భారత సైనికులు అమరులయ్యారంటే..?
ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌కు ఇంతవరకూ చూపించింది ట్రైలరే. ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందుముందు చూపిస్తామని స్పష్టం చేశాయి..త్రివిధ దళాలు. ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని..సీజ్‌ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
- Balaraju Goud
- Updated on: May 11, 2025
- 9:29 pm