AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్

కేసీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ సారి విజయం సాధించి సీఎంగా హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఉద్యమమే ఊపిరిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు కేసీఆర్. ప్రస్తుత ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తనకు రూ.58.92 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తన ఎన్నికల అఫిడవిడ్‌లో కేసీఆర్ వెల్లడించారు. అయితే తన పేరిట కారు లేదని తెలిపారు.

మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు. సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో బీఏ, ఉస్మానియి యూనివర్సిటీలో ఎంఏ (తెలుగు సాహిత్యం) చదువుకున్నారు. 1969లో శోభను వివాహం చేసుకున్నారు. వారికి కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఉన్నారు.

తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 70వ దశకంలో యువజన్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రవేశం చేశారు. 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అనంతుల మదన్‌ మోహన్‌(కాంగ్రెస్)పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేసీఆర్ కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్నారు.

ఇంకా చదవండి

Revanth Reddy: అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్లు గుంపు పాలైందని.. కాళేశ్వరం సహా ఏ పథకం మీదైనా చర్చకు సిద్ధమేనంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ నిర్ణయాల్లో లోపాలు ఉంటే సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కడుపు నిండా విషం పెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ రేవంత్ మండిపడ్డారు.

Revanth Reddy: కేసీఆర్‌ స్పీచ్‌లో క్లారిటీ లేదు.. వాళ్లకు పొగరు పెరిగింది.. పదవులు ఇవ్వం: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ అభద్రతాభావంలో మాట్లాడారని.. ఆయన స్పీచ్‌లో క్లారిటీ లేదంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని.. రాహుల్‌గాంధీకి, తనకు గ్యాప్‌ ఉందనడం అవాస్తవమంటూ పేర్కొన్నారు.

Operation Kagar: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

ఆపరేషన్‌ కగార్‌ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటోంది. ఒకవైపు సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా.. మరోవైపు.. ఆపరేషన్‌ కగార్‌ను బంద్‌ చేయాలంటున్నారు కేసీఆర్‌. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అమాయకులను కాల్చి చంపడం కాదు.. శాంతి చర్చలు జరపాలని కేసీఆర్‌ కామెంట్స్‌ చేయడం ఆసక్తిగా మారుతోంది.

KCR: ఆనాడైనా.. ఈనాడైనా.. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ః కేసీఆర్

ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పరిపాలనలో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఆపడం ఎవరి తరం కాదన్నారు.

Telangana: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా

దారులన్నీ ఓరుగల్లు వైపే.. బండెనక బండి కట్టి.. కారెనక కారు పెట్టి.. రజతోత్సవ సభకు కదనోత్సాహంతో కదులుతున్నారు గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నాయ్‌. సభకు వంద కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఓరుగల్లు గర్జనకు ముందే విపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

KCR: గులాబీ జెండా.. తెలంగాణకు అండాదండా..! బీఆర్ఎస్ రజతోత్సవ జాతరపై స్పెషల్ స్టోరీ..

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత చరిత్రలో వేల రాజకీయ పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. అందులో అనేకం మఖలో పుట్టి పుబ్బలో మాయమయ్యాయి. కొన్ని మాత్రమే సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో మనగలిగినయి. రాష్ట్ర సాధన కోసమే ఒక రాజకీయపార్టీని స్థాపించి..పద్నాలుగేండ్లు ప్రజా ఉద్యమాన్ని ముందుండి నడిపి.. తన ప్రాణాలే పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించి.. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన అనితర సాధ్యమైన చరిత్ర కేసీఆర్‌ సొంతం! ఆయన మానసపుత్రిక తెలంగాణ రాష్ట్ర సమితి..ప్రస్తుత BRS.. 25 ఏళ్ల పండుగ జరుపుకొంటోన్న వేళ ప్రత్యేక కథనం..

తెలంగాణ ప్రజలకు KCR క్షమాపణలు చెప్తారా..? KTR సమాధానం ఇదే!

తెలంగాణకు విఘాతం కలిగితే వెంటనే స్పందించే వ్యక్తి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో ప్రత్యేక ముఖాముఖిలో కేటీ రామారావు మాట్లాడారు.

కేసీఆర్ రీఏంట్రీపై.. టీవీ9 ఇంటర్వ్యూలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అస్థిత్వాన్ని ఆగమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారన్నారు కేటీఆర్. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఎల్కతుర్తిలో నిర్వహించబోతున్న నేపథ్యంలో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ తో ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అట్టహాసంగా ఏర్పాట్లు!

25 ఏళ్ల వైభవాన్ని చాటిచెప్పేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది గులాబీ పార్టీ. బాహుబలి వేదిక.. ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేసేలా ప్రదర్శనలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్ని విశిష్టతలు ఉండబోతున్నాయని భారతీయ రాష్ట్ర సమితి(BRS) పార్టీ సంకేతాలు ఇస్తోంది. పోరాటాల పురిటిగడ్డ వరంగల్ వేదికగా కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేసి తమ సత్తా చాటుతామంటోంది కారు పార్టీ.

BRSలో కొత్త లొల్లి.. హరీష్‌కు దక్కుతుందా? కేటీఆర్‌కు ఇస్తారా? మూడో నాయకుడు ముందుకొస్తారా?

సాధారణంగా అధికార పార్టీలో పదవుల కోసం పోటీ ఉంటుంది. ఒక్కోసారి కుమ్ములాటలు కూడా జరుగుతుంటాయి. కానీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలో కీలకమైన పదవి కోసం పోటీ ఏర్పడటం.. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మూడింట్లో రెండు ఆల్రెడీ ఫిక్సయిపోగా... మిగిలిన ఒక్క పోస్టు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఏర్పడింది? ఇంతకీ ఏంటా పదవి? ఎందుకా సస్పెన్స్‌?