AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్‌ను ఆయన ఫ్యాన్స్ పవన్ స్టార్, జనసేనానిగా పిలుచుకుంటారు. 1971 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో పవన్ జన్మించారు. అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల మక్కువ పెంచుకున్న పవన్.. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశారు. తొలిప్రేమ, సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ చిత్రాలు పవన్‌కు మంచి గుర్తింపు సాధించిపెట్టాయి. 27 ఏళ్ల సినీ ప్రస్థానంలో పవన్ సినిమాలు కలెక్షన్ల రికార్డులను తిరగరాసాయి. నిర్మాత, దర్శకుడిగానూ ప్రయత్నించారు. జపాన్ దర్శకుడు అకీరా కురసోవా స్ఫూర్తితో దర్శకుడుగా ‘జానీ’ చిత్రాన్ని రూపొందించారు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రవేశం ఉంది.

2008లో తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీ ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజా రాజ్యం పార్టీ యువజన విభాగానికి అధ్యక్షునిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత ఆ పార్టీని వీడిన పవన్.. 2014 మార్చిలో జనసేన పార్టీని స్థాపించారు. 2019లో 140 నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసింది. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసి, రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెవిచూశారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన విజయం సాధించింది. 2024లో ఏపీలో జరిగే జమిలి ఎన్నికల్లో టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

సోషల్ మీడియాలోనూ పవన్ కల్యాణ్‌కు విశేషమైన ఆదరణ ఉంది. ఇటీవల ఇన్‌స్టాగ్రమ్‌లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్‌కు ఒక్క పోస్ట్ చేయకుండానే లక్షల సంఖ్యలో ఫాలోవర్లు చేరారు. జనసేనాన్ని క్రేజ్ అలాంటిది మరి..!

ఇంకా చదవండి

Pawan- Mahesh: పవన్‌కు ప్రియురాలిగా.. మహేష్‌కు తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టీచర్‌గా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు. టాక్ తో అసలు సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి ఈ హీరోల సినిమాలు. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంలో ఎవరికి వారే సాటి.

Operation Sindoor: హర్షించదగ్గ విషయం.. మోదీకి మద్దతుగా నిలవాలి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్..

పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని.. మూడు ఉగ్రవాద సంస్థలపై భారత్ దాడి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇది ప్రతి భారతీయుడు హర్షించదగ్గ విషయమంటూ పవన్‌కల్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు కూడా పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.

Harihara Veeramallu: ఇది ఓకే.. ఆ ఒక్క మాట ఎప్పుడు చెప్తారు? వీరమల్లు ఫ్యాన్స్ క్వశ్చన్..

ఇది ఓకే... ఆ ఒక్క మాట ఎప్పుడు చెప్తారు? అంటున్నారు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్. ఇంతకీ ఏది ఓకే.. ఇంకేం చెప్పాలి? అని అంటున్నారా? షూటింగ్‌ పూర్తయిన మాట ఓకే.. కానీ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు? అంటున్నారు. ఇంతకీ గురూజీ ఇచ్చిన ఫైనల్‌ టచ్‌ ఎలా ఉంది? ఈరోజు దీని గురించి మనం తెలుసుకుందాం రండి.. 

Preeti Jhangiani: పవన్ కల్యాణ్ తమ్ముడు హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు బిజినెస్ ఉమన్.. ఎలా మారిపోయిందో చూశారా?

సినిమాల్లో ఫేడవుల్ అయిపోయిన హీరోయిన్లలో చాలా మంది తమ భర్త, పిల్లలతో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరికొందరు సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొందరు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

ప్రభాస్‌కు కోడలిగా, పవన్ కళ్యాణ్‌కు లవర్‌గా చేసిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనేక భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. వరుసగా రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలతో పాటు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు రెబల్ స్టార్.

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నింటికీ అలవాటు పడిపోయారు. సినిమా వస్తుందంటే ఆనందం లేదు.. రావట్లేదంటే బాధ లేదు. వచ్చినపుడు చూసుకుందాం.. రాకపోతే సర్దుకుందాం అన్నట్లు తయారైపోయారు వాళ్లు. ఇలాంటి సమయంలో ఒక గుడ్ న్యూస్.. ఓ బ్యాడ్ న్యూస్ వాళ్ల కోసం ఎదురు చూస్తుంది. మరి ఆ న్యూస్‌లేంటో ఓసారి చూద్దామా..?

Tollywood: చిరు, పవన్‌లతో సినిమాలు.. క్రికెటర్లతో లవ్ ఎఫైర్లు.. పత్తా లేకుండా పోయిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

తెలుగులో ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లతో సినిమాలు చేసింది. నందమూరి బాలకృష్ణతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ క్రేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది. అదే సమయంలో స్టార్ క్రికెటర్లతో లవ్, డేటింగ్ రూమర్లతో తరచూ వార్తల్లో నిలిచింది.

ఒకప్పుడు తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఎవరో కనిపెట్టరా..

ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. టాలీవుడ్ లో యంగ్ బ్యూటీస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో రాణిస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది.

Tollywood: పేరు చెబితే అభిమానులకు పూనకాలే.. ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?

అతడి సినిమా వచ్చిదంటే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. అటు సినిమాలు.. ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

5 కోట్ల మందికి జీవనాడి.. ధర్మ యుద్ధంలో గెలిచిన అమరావతి రైతులు.. పవన్ కల్యాణ్

రైతులు భూములు మాత్రమే ఇవ్వలేదు.. రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతి రైతులు ఐదేళ్లుగా లాఠీదెబ్బలు తిని నలిగిపోయారన్న పవన్, అమరావతి రైతుల కన్నీళ్లు తుడిచే సమయం వచ్చిందన్నారు. అమరావతి ఐదు కోట్ల మందికి సంబంధించిన హబ్.. గత ప్రభుత్వం అమరావతి భవిష్యత్తును తుడిచిపెట్టిందన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులు విజయం సాధించారన్నా పవన్ కల్యాణ్.