
నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
POK, ఉగ్రవాదులను భారత్‌కు అప్పగిస్తేనే చర్చలు.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదుః ప్రధాని మోదీ
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించే ఒప్పందంపై జరిగిన చర్చ సందర్భంగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. పొరుగు దేశంతో చర్చించాల్సిన ఏకైక విషయం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి రావడం మాత్రమే అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎలా ఎదుర్కోవాలనే అంశంపైనే మాత్రమే చర్చలు జరుగుతాయని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారు.
- Balaraju Goud
- Updated on: May 11, 2025
- 6:35 pm
PM Modi: పీఓకేతోపాటు ఉగ్రవాదులను అప్పగించాలి.. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
భారత్ - పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటూ పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తన నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ.. త్రివిధ దళాలకు కీలక ఆదేశాలిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
- Shaik Madar Saheb
- Updated on: May 11, 2025
- 5:06 pm
PM Modi: నెక్స్ట్ ఏంటి..? త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ కీలక భేటీ..
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం.. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.
- Shaik Madar Saheb
- Updated on: May 11, 2025
- 4:19 pm
మే 6 వైమానిక దాడి నుండి విరమణ వరకు.. ‘యుద్ధం’లో భారత్ ఏం సాధించింది?
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టినప్పటీ నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు ఓకే చెప్పేవరకూ బోర్డర్ దద్దరిల్లింది. ఇరుదేశాలు ఒకరిపై మరొకరు బాంబులు, మిస్సైళ్లతో దాడులకు తెగబడ్డారు. డ్రోన్లతోనూ విరుచుకుపడ్డారు. దీంతో సరిహద్దు ప్రాంతాలు శకలాల దిబ్బలుగా మారిపోయాయి.
- Balaraju Goud
- Updated on: May 11, 2025
- 5:18 am
India-Pakistan: యుద్ధం ఆగింది సరే.. నెక్స్ట్ ఏంటి..? ప్రధాని మోదీ కీలక సమావేశం..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడం.. ఈ క్రమంలోనే పాక్ నుంచి భారత్ కు ఫోన్ రావడం.. చర్చలు అంటూ మాట్లాడటం.. చకాచకా జరిగిపోయాయి.. దీంతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో.. భారత్ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది. సాయంత్రం 5 గంటల నుంచి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది.
- Shaik Madar Saheb
- Updated on: May 10, 2025
- 8:10 pm
Act of War: యుద్ధమే..! ఉగ్రవాదంపై మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇకపై పాకిస్తాన్ గజగజ వణకాల్సిందే..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలోఈ భేటీ జరిగింది.
- Shaik Madar Saheb
- Updated on: May 10, 2025
- 4:52 pm
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై అమెరికా ఒక కీలక ప్రకటన చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా నిరాకరించింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడం గురించి ట్రంప్ మాట్లాడారు.
- Balaraju Goud
- Updated on: May 9, 2025
- 11:53 pm
ప్రధానమంత్రి నివాసంలో కీలక భేటీ.. త్రివిధ దళాలకు చెందిన తాజా, మాజీలతో మోదీ సమీక్ష
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ భారత ప్రధానమంత్రి నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లోని తాజా పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు. పాకిస్తాన్‌పై చర్యల విషయంలో సైన్యానికి ఇప్పటికే పూర్తి స్వేచ్చ ఇచ్చారు ప్రధాని మోదీ. దీంతో పాకిస్థాన్ కవ్వింపు చర్యలను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది.
- Balaraju Goud
- Updated on: May 9, 2025
- 11:11 pm
Operation Sindoor: సిందూర్ అంటే మా జీవితాలు.. మధుసూదన్ సతీమణి భావోద్వేగం.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈ వార్త విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కుటుంబం స్పందించింది. భారత్ ప్రతీకార చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి, ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: May 8, 2025
- 11:50 am
India-Pakistan: భారత్‌తో పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది.. నెక్స్ట్ బొమ్మ కనబడాల్సిందే.. ఇవాళ అఖిలపక్షం భేటీ..
భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో మరోసారి తమ శక్తి యుక్తిలను చాటిచెప్పింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్న సైన్యం.. పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్ నెక్ట్స్ స్టెప్ ఎంటి? అనేది ఉత్కంఠగా మారింది. అయితే.. బోర్డర్‌లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి.. పాకిస్తాన్ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి..
- Shaik Madar Saheb
- Updated on: May 8, 2025
- 8:32 am