AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ బాబు

మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్ బాబు.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మహేష్ అనతికాలంలోనే స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు.

మహేష్ బాబు సినిమాలతో పాటు పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దాదాపు 1200 మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయించి వారి కుటుంబంలో వెలుగులు నింపాడు. మహేష్ బాబును టాలీవుడ్ అందగాడు అని పిలుస్తూ ఉంటారు. చూడటాన్ని హాలీవుడ్ హీరోలా ఉండే మహేష్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ ఘట్టమనేని మహేశ్ బాబు 1975 ఆగస్టు 9న జన్మించారు. ఈయన ప్రఖ్యాత నటుడు కృష్ణ కుమారుడు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించాడు. సూపర్‌ హిట్ సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. మొదటి సినిమా రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటి నమ్రత శిరోద్కర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు గౌతమ్‌, సితార అనే ఇద్దరు పిల్లలున్నారు.

ఇంకా చదవండి

Mahesh Babu: కొనసాగుతున్న సస్పెన్స్.. నేడు ఈడీ విచారణకు మహేష్ బాబు..?

రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్‌ కంపెనీల ప్రమోషన్ కోసం మహేశ్ బాబు రూ. 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నారని.. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారనే ఆరోపణలతో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు ఏప్రిల్ నెల 22న ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు

Pawan- Mahesh: పవన్‌కు ప్రియురాలిగా.. మహేష్‌కు తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇప్పుడు టీచర్‌గా..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు. టాక్ తో అసలు సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి ఈ హీరోల సినిమాలు. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడంలో ఎవరికి వారే సాటి.

SSMB 26: రాజమౌళి కోసం మొదటిసారి అలా కనిపించనున్న మహేష్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల విజయం తర్వాత జక్కన మరోసారి భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమయ్యాడు.

Mahesh Babu: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో! వారసుడి అరంగేట్రానికి ముహూర్తం ఫిక్స్ ! డైరెక్టర్ ఎవరంటే?

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడిగా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోనున్నాడు. త్వరలోనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఇప్పటికే కథ కూడా ఫిక్స్ అయ్యిందని, డైరెక్టర్, నిర్మాత కూడా ఫైనల్ అయ్యారని సమాచారం.

Sitara Ghattamaneni: గాగ్రా చోళీలో మెరిసిపోయిన మహేష్ బాబు కూతురు.. సితార పాప బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?

మహేష్ బాబు కూతురిగానే కాకుండా స్టార్ కిడ్ గా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార ఘట్టమనేని. ముఖ్యంగా సోషల్ మీడియాలో సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ స్టార్ కిడ్ షేర్ చేసిన ఫొటోస్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Dual Role: డ్యూయల్ రోల్‎లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. రానున్న సినిమాలు ఏంటి.?

అభిమాన నాయకుడిని తెరమీద ఒక పాత్రలో చూడటానికే రెండు కళ్లు సరిపోవు అభిమానులకు. అలాంటిది రెండు కేరక్టర్లంటే కనిపిస్తే పరిస్థితి మామూలుగా ఉంటుందా? జబర్దస్త్ అంటూ ఖుషీ అవుతున్నారు జనాలు. మరి డ్యూయల్ రోల్ స్టోరీ ఏంటి.? ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది.? దీని సంగతి చూద్దాం పదండి.. 

Heroes: పాన్ ఇండియా ట్రెండ్‎తో హీరోలకు కష్టాలు.. ఫ్యాన్స్‌కు దూరం..

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిందంటూ తెలుగులో ఓ అద్భుతమైన సామెత ఉంటుంది. ఇప్పుడు ఇదే మన హీరోల విషయంలోనూ జరుగుతుంది. ప్యాన్ ఇండియా.. ప్యాన్ ఇండియా అంటూ ఫ్యాన్స్‌కు దూరం అయిపోతున్నారు. అతి జాగ్రత్తకు పోయి ఉన్నది పోగొట్టుకుంటున్నారు. మరి ఎవరా హీరోలు.. వాళ్ల సమస్యేంటి..? ఇదే ఇవాల్టి స్టోరీ..

International Range: బార్డర్లు దాటుతున్న కథలు.. మన మేకర్స్ ఎం ప్లాన్ చేస్తున్నారు.?

కథ బార్డర్లు దాటుతుంటే, ఊహలు ఉన్నచోటే.. మేమూ కదలకుండా ఉంటామంటే ఎలా? మీరు ఎంతైనా ఊహించుకోండి.. దానికి ఇంచు ఎక్కువే ఉంటుందనే హింట్స్ ఇస్తూ.. అవతలివారి ఊహను కేల్కులేట్‌ చేయడమెలా? వాటిని చేరుకోవడానికి టెక్నీషియన్లను వెతికిపట్టుకోవడం ఎలా? మరి మన మేకర్స్ ప్లాన్ ఏంటి.? ఇప్పుడు చూద్దాం..

Tollywood Updates: ఇంటర్నేషనల్‌ మార్కెట్ ఆ సినిమాల టార్గెట్.. అందుకే ఆ ప్లాన్..

మన దగ్గర రిలీజ్‌ అయ్యాక ఇంగ్లిష్‌లోనో, చైనీస్‌లోనో, జపనీస్‌లోనో రిలీజ్‌ చేయడం ఎందుకు? సైమల్‌టైనియస్‌గా సినిమాలను ఫారిన్‌ లాంగ్వేజెస్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు కదా.. జక్కన్న మనసులోనూ అదే ఉందా.. ఇప్పుడు మూవీ లవర్స్ మధ్య జరుగుతున్న ఇంటర్నేషనల్‌ డిస్కషన్‌ ఇది...

Tollywood Updates: టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..

మండుటెండలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయినా హీరోలు ఏమాత్రం గ్యాప్‌ లేకుండా షూటింగులు చేస్తూనే ఉన్నారు. వెకేషన్‌కి వెళ్లొచ్చిన మహేష్‌ మళ్లీ మేకప్‌ వేసుకుంటున్నారు. మిగిలిన హీరోల సంగతేంటి అంటారా? అందరూ బిజీనే..! ఆ సినిమాలు ఏంటి.? ఎవరు ఎక్కడ ఉన్నారు.? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..