
ఎనుముల రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండో ముఖ్యమంత్రి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.
రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతా రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆపరేషన్ సింధూర్‌కు అండగా కదులుతున్న యావత్ భారతావని.. సైన్యానికి ఉడతాభక్తిగా సాయం!
భారత్ పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ.. భారత సైన్యం చూపుతున్న ధైర్య సాహసాలు, జవాన్ల పరాక్రమాలను యావత్ దేశం కీర్తిస్తోంది. శత్రు దేశం గడ్డ మీదకు వెళ్లి మరీ మనోళ్లు చూపుతున్న సత్తాను కొనియాడుతోంది. భారత సైన్యం శక్తిని తట్టుకోలేక.. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్న శత్రు మూకలను బోర్డర్‍లో నిలిపేస్తున్న జవాన్లు కోసం ప్రముఖులు ఉడతాభక్తిగా విరాళంగా అందిస్తున్నారు.
- Balaraju Goud
- Updated on: May 10, 2025
- 2:44 am
ఆపరేషన్ సింధూర్ తర్వాత టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టీవ్ కాబోతున్నాయా..? ఏపీ, తెలంగాణ అలెర్ట్
భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ అలెర్ట్ అయ్యాయి. రాబోయే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునేలా అన్ని శాఖల అధికారులను సన్నద్ధం చేస్తున్నాయి. అందులోనూ.. గత అనుభవాల దృష్యా హైదరాబాద్‌లోని స్లీపర్ సెల్స్ యాక్టీవ్‌పై తెలగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పెషల్ ఫోకస్ పెట్టడం ఆసక్తి రేపుతోంది.
- Balaraju Goud
- Updated on: May 7, 2025
- 11:06 pm
భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి.
- Shaik Madar Saheb
- Updated on: May 7, 2025
- 9:57 am
CM Revanth Reddy: ఎవరిమీద సమరం.. మీకు బాధ్యత లేదా? ఉద్యోగ సంఘ నేతలపై రేవంత్ సీరియస్..!
ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగుతామన్న ఉద్యోగలను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదని, అణాపైసా అప్పు పుట్టడంలేదన్నారు. బ్యాంకుల దగ్గరకు వెళితే దొంగలను చూసినట్టు చూస్తున్నారన్నారు. ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలో సంఘాల నేతలు చెప్పాలని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Balaraju Goud
- Updated on: May 5, 2025
- 6:34 pm
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు షాక్.. సిబిల్ లేకపోతే లోన్ రానట్టేనా..?
రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్‌ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లేదా గతంలో రుణాలు తీసుకుని చెల్లించకపోతే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- Prabhakar M
- Updated on: May 5, 2025
- 10:38 am
Revanth Reddy: అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పదేళ్లు గుంపు పాలైందని.. కాళేశ్వరం సహా ఏ పథకం మీదైనా చర్చకు సిద్ధమేనంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమ నిర్ణయాల్లో లోపాలు ఉంటే సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కడుపు నిండా విషం పెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారంటూ రేవంత్ మండిపడ్డారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 30, 2025
- 4:44 pm
Revanth Reddy: కేసీఆర్ స్పీచ్‌లో క్లారిటీ లేదు.. వాళ్లకు పొగరు పెరిగింది.. పదవులు ఇవ్వం: సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అభద్రతాభావంలో మాట్లాడారని.. ఆయన స్పీచ్‌లో క్లారిటీ లేదంటూ పేర్కొన్నారు. కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని.. రాహుల్‌గాంధీకి, తనకు గ్యాప్ ఉందనడం అవాస్తవమంటూ పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Apr 28, 2025
- 1:58 pm
Operation Kagar: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్.. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..
ఆపరేషన్ కగార్ పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఒకవైపు సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ భేటీ కాగా.. మరోవైపు.. ఆపరేషన్ కగార్‌ను బంద్ చేయాలంటున్నారు కేసీఆర్. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను కాల్చి చంపడం కాదు.. శాంతి చర్చలు జరపాలని కేసీఆర్ కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారుతోంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 28, 2025
- 7:14 am
ముగిసిన భారత్ సమ్మిట్.. పదేళ్లలో రాజకీయాలు ఎంతగానో మారిపోయాయిః రాహుల్ గాంధీ
దేశంలో పాత తరం రాజకీయం అంతరించిపోయిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయం నడుస్తోందన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ సమ్మిట్ సక్సెస్ అయిందన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 26, 2025
- 7:42 pm
Telangana Cabinet Expansion: రేవంత్ ఒకలా.. మీనాక్షి మరోలా..! కన్‌ఫ్యూజన్‌లో కాంగ్రెస్ నేతలు
ఇదిగో.. అదిగో.. అన్నారు. కొందరైతే డేట్ కూడా ఫిక్స్ చేశారు. తీరా చూస్తే ఏదీ లేదు. వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది.. అసలు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది. అయితే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కామెంట్స్‌తో మరోసారి కేబినెట్ అంశం తెరపైకొచ్చింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 24, 2025
- 9:23 am